Nara Ramamurthy Naidu: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమం.. హైదరాబాద్ కు బయల్దేరిన లోకేశ్

CM Chandrababu brother Nara Ramamurthy Naidu health condition serious
  • హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తినాయుడు
  • అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న నారా లోకేశ్
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు బయల్దేరే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో... ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు. 

ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని చంద్రబాబు హైదరాబాద్ కు బయల్దేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినీ హీరో నారా రోహిత్... రామ్మూర్తినాయుడు కుమారుడు అనే విషయం అందరికీ తెలిసిందే. 
Nara Ramamurthy Naidu
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News