YS Avinash Reddy: పరారీలో వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ.. సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు!

Police issues search warrant to YS Avinash Reddy PA Raghava Reddy
  • రాఘవరెడ్డికి 41ఏ నోటీసుల జారీ  
  • పులివెందుల, లింగాల మండలాల్లో నిఘా పెట్టిన పోలీసులు
  • వారం రోజుల నుంచి పరారీలో ఉన్న రాఘవరెడ్డి
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఇంట్లో ఏ క్షణంలోనైనా సోదాలు నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. 

వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన స్వగ్రామం అంబకపల్లెతో పాటు పులివెందుల, లింగాల మండలాల్లో పూర్తిగా నిఘా పెట్టారు.
YS Avinash Reddy
PA
Raghava Reddy
Search Warrant

More Telugu News