Mohan: 16 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో .. అయినా దక్కని ఫలితం!

Mohan Special

  • 1980 - 90లలో హీరోగా మెప్పించిన మోహన్ 
  • 2008 నుంచి తమిళ సినిమాలకు దూరం 
  • ఇటీవలే 'హరా' సినిమాతో జరిగిన రీ ఎంట్రీ 
  • కథాకథనాల పరంగా ఆకట్టుకోలేకపోయిన కంటెంట్  


మోహన్ .. 1980 - 90లలో హీరోగా ఒక వెలుగు వెలిగిన నటుడు. ప్రధానంగా తమిళంలో సినిమాలు చేస్తూ వెళ్లిన మోహన్, తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ను చాలా కాలం పాటు కొనసాగించిన ఆయనను, 'కోకిల' మోహన్ అనీ .. 'మైక్' మోహన్ అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. స్రవంతి ... ఆలాపన వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

అలాంటి ఆయన 2008 నుంచి తమిళంలో సినిమాలు చేయలేదు. దాదాపు 16 ఏళ్లపాటు ఆయన తమిళ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అందుకు కారణం ఏమిటనేది కూడా తెలియదు. అలాంటి ఆయన ఇటీవల చేసిన సినిమానే 'హరా'. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. పెద్దగా రెస్పాన్స్ ను రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఆ తరువాత 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇటీవలే తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.  
 
కథలోకి వెళితే .. రామ్ (మోహన్) కి తన కూతురంటే ప్రాణం. కోయంబత్తూర్ లోని ఒక స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయి ఒక రోజున అదృశ్యమవుతుంది. ఆమె సూసైడ్ చేసుకుని ఉంటుందనడానికి ఆధారాలు లభించడంతో అతను కుప్పకూలిపోతాడు. చనిపోవడానికి ముందు ఆమె గర్భవతి అని తెలిసి షాక్ అవుతాడు. అందుకు అవకాశమే లేదనే ఆలోచనతో అతను ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఫలితంగా అతనికి తెలిసే నిజాలేమిటి? అనేది కథ. 16 ఏళ్ల తరువాత మోహన్ చేసిన ఈ సినిమా, అటు థియేటర్లలోనూ .. ఇటు ఓటీటీలోను ఆడియన్స్ ను మెప్పించేదిగా లేకపోవడం విచారించదగిన విషయమే.

  • Loading...

More Telugu News