Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్‌కు నోటీసులు

Phone Tapping Case BRS Leader Jaipal Yadav Received Notices

  • కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు
  • ఈ ఉదయం విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత
  • ఇదివరకే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
  • ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తూ నోటీసులు ఇస్తున్న పోలీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్‌ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేశారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఆయన ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News