Nara Rohit: తండ్రి రామ్మూర్తినాయుడు గురించి నారా రోహిత్ భావోద్వేగ పోస్ట్

Nara Rohit emotional post on his father Ramamurthy Naidu
  • మీరు ఒక ఫైటర్ నాన్నా అన్న నారా రోహిత్
  • ఒక యోధుడిలా బతకడాన్ని నేర్పించారని వ్యాఖ్య
  • తమ కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న రోహిత్
నిన్న తుదిశ్వాస విడిచిన తన తండ్రి రామ్మూర్తినాయుడు గురించి ఆయన కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. 'మీరు ఒక ఫైటర్ నాన్నా. ప్రేమించడం, యోధుడిలా బతకడాన్ని మీరు నాకు నేర్పించారు. మీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం మీరు నేర్పించారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నప్పటికీ... మాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా... జీవితాంతం మరిచిపోలేని మీ జ్ఞాపకాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. బై నాన్నా' అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం రామ్మూర్తి పార్థివదేహాన్ని నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసం వద్ద ఉంచారు.
Nara Rohit
Nara Ramamurthy Naidu

More Telugu News