Jyotika: కంగువా సినిమాపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు
--
సూర్య కొత్త సినిమా కంగువాపై ఆయన భార్య, నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగువా సినిమా తొలి అరగంట బాగాలేదని వ్యాఖ్యానించారు. అది మినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు. సూర్య భార్యగా కాకుండా సినిమా లవర్ గా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కంగువా ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా ప్రారంభంపై కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ తర్వాత మాత్రం సినిమా అలరించిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నటి జ్యోతిక తమ సినిమాపై అభిప్రాయం వెల్లడించారు.