RGV: పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ

Ramgopal Varma Absent to Police Enquiry

  • ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు పోలీసుల ఏర్పాట్లు
  • చివరి నిమిషంలో విచారణకు రాలేనంటూ ఆర్జీవీ మెసేజ్
  • నాలుగు రోజుల తర్వాత హాజరవుతానంటూ వాట్సాప్ లో సందేశం

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఉదయం పది గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ అందించారు. ఈమేరకు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని ఆర్జీవీ చెప్పారు. అయితే, తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని ఆర్జీవీ తన మెసేజ్ లో పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, వ్యక్తిగత పనులు ఉండడంతో విచారణకు హాజరుకాలేక పోతున్నానంటూ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News