gold loans: వాయిదాల పద్ధతిలో గోల్డ్ లోన్ చెల్లింపులు.. ఆర్బీఐ ఆలోచన

gold loans may soon come with emi options says sources

  • బంగారం తాకట్టు రుణాలపై ఆర్బీఐ నూతన ఆలోచన
  • ఈఎంఐ తరహాలో నెలవారీగా చెల్లింపుల సదుపాయం
  • బ్యాంకుల్లో రూ.1.14 లక్షల కోట్ల విలువైన బంగారం తాకట్టు రుణాలు

ప్రజలు తమ అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక అవసరాలను తీర్చుకునేందుకు ఒక్కోసారి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకుంటుంటారు. ఈ రుణాలు చాలా సురక్షితమే అయినప్పటికీ ప్రస్తుతం వీటికి వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు. తీసుకున్న రుణ గడువు తీరకముందే అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంది.  ఒకేసారిగా అసలు, వడ్డీ కలిపి కట్టాల్సి రావడంతో గడువు తీరినా కొందరు రుణం చెల్లించలేకపోతున్నారు. దీంతో వారు తనఖా పెట్టిన బంగారు అభరణాలు వేలంకు వస్తుంటాయి. 

అయితే, బంగారం తాకట్టు రుణాలను ఈవీఎం (నెలవారీ కిస్తీ) పద్ధతిలో చెల్లించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం.  ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు  పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
కాగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి దేశంలోని బ్యాంకులు దాదాపు రూ.1.14 లక్షల కోట్ల విలువైన బంగారం తాకట్టు రుణాలు మంజూరు చేసినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.   

  • Loading...

More Telugu News