Earth: అంతరిక్షంలో నడుస్తూ.. భూమిని చూస్తుంటే..! వీడియో ఇదిగో

Walking in space looking at Earth Here is the video

  • చాలా మందికి కాస్త ఎత్తు నుంచి తొంగి చూడటానికే భయం
  • వందల కిలోమీటర్లపైన అంతరిక్షంలో తేలియాడుతూ వీడియో తీసిన నాసా వ్యోమగామి
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

ఐదారు అంతస్తుల ఎత్తున్న భవనం పైనుంచి కిందికి తొంగి చూడటానికే భయపడుతుంటాం. అమ్మో.. అంత ఎత్తు నుంచి పడితే ఏమైనా ఉందా? అని అంటుంటాం. అదే ఇంకా ఎత్తయిన ప్రదేశం నుంచి చూడాల్సి వస్తే... కాళ్లు, చేతులు వణికిపోవడం ఖాయం. కానీ పూర్తిగా అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఎలా ఉంటుంది.. ఏదో గదిలో ఉన్నట్టుగా లోపల ఉండి కాదు... బయట అంతరిక్షంలో తేలియాడుతూ (స్పేస్‌ వాక్‌ చేస్తూ) కింద వందల కిలోమీటర్ల దిగువన ఉన్న భూమిని చూస్తుంటే.. ఆ అనుభూతే వేరు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న నాసా వ్యోమగామి ఒకరు ఇలాంటి దృశ్యాన్ని వీడియో తీశారు. ఐఎస్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చి స్పేస్‌ వాక్‌ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అంతెత్తున భూమి తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News