Nimmala Rama Naidu: బుడమేరుకు వరదలపై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు

Minister Ramanaidu on Budameru floods

  • బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
  • 15 వేల క్యూసెక్కుల నీరు ఒకేసారి రావడంతో గండ్లు పడ్డాయని వెల్లడి
  • మరోసారి వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామన్న మంత్రి

బుడమేరుకు వరదలు రావడంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పాపం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయన్నారు. బుడమేరు వరదలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కెనాల్ పనులను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ క్రమంలోనే ఒకేసారి 15 వేల క్యూసెక్కుల నీరు రావడంతో గండ్లు పడి వరదలు వచ్చాయన్నారు. మరోసారి ఇలాంటి వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామన్నారు.

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను జలవనరుల శాఖ తీసుకుంటుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతిరోజు గోదావరి హారతి నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు. గత ఐదేళ్ళలో గోదావరి హారతిని నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం... ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేసిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News