Jagan: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు

Jagan greetings on World Fishermans Day

  • నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
  • గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని ట్వీట్

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం మ‌న ప్ర‌భుత్వంలో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామని తెలిపారు. స‌ముద్రంపై వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతో రూ. 3,767.48 కోట్ల‌తో 10 ఫిషింగ్ హార్బ‌ర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 

వేట‌ నిషేధ స‌మ‌యంలో దాదాపు 1,23,519 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని జగన్ తెలిపారు. స‌బ్సిడీపై డీజిల్‌ అందించామని వెల్లడించారు. ఇలాంటి ఎన్నో కార్య‌క్ర‌మాలను మత్స్యకారుల కోసం చేప‌ట్టామని తెలిపారు. ప్ర‌పంచ మ‌త్స్య‌కారుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News