TS High Court: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించిన హైకోర్టు

HC verdict on MLAs disqualification

  • తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచన
  • ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకోవాలని సూచన
  • సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది.

10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్ జడ్జి సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు మరో పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు తీర్పు ఇచ్చింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద్ పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లు స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News