Population: భారత జనాభా చైనా కంటే డబుల్... అదెలాగో తెలుసా?
- జనాభా విషయంలో చాలా ఏళ్లుగా పోటీపడుతున్న భారత్, చైనా
- కొన్నేళ్లుగా చైనాలో తగ్గిపోతున్న జననాల రేటు
- ఇప్పటికీ ఇరు దేశాల మధ్య జనాభా సంఖ్యలో స్వల్ప తేడానే...
- భవిష్యత్తులో చైనా జనాభా భారీగా తగ్గిపోతుందని అంచనా
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం ఏదంటే చైనా అని అందరూ టక్కున చెబుతారు. కానీ అనధికారికంగా భారత్ జనాభాలో చైనాను దాటేసింది. కానీ రెండు దేశాల మధ్య తేడా స్వల్పమే. కానీ భవిష్యత్తులో భారత జనాభా సంఖ్యతో పోలిస్తే చైనా జనాభా సంఖ్య సగమే ఉంటుందట. ఏదో ఉత్తుత్తి లెక్క కూడా కాదు. ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా విభాగం వేసిన అధికారిక అంచనాలే ఇవి.
2100 సంవత్సరం నాటికి...
దాని ప్రకారం 2100 సంవత్సరం నాటికి భారత జనాభా 153 కోట్లకు చేరుకుంటే... చైనా జనాభా 77 కోట్లకు తగ్గిపోతుందట. చైనాలో చాలా ఏళ్లుగా ‘ఒకరు లేదా అసలే వద్దు’ అనే నినాదంతో పిల్లలను కనడం తగ్గించేశారు. దానికితోడు పెరిగిపోతున్న ఖర్చులతోనూ ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దానితో కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గిపోతూ వస్తోంది. మన దేశంలో పరిస్థితి మధ్యస్థంగా ఉంది. అందువల్ల జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
2100 సంవత్సరం నాటికి ప్రపంచ దేశాల జనాభా అంచనాలు | |
దేశం | జనాభా సంఖ్య |
భారత్ | 153.3 కోట్లు |
చైనా | 77.1 కోట్లు |
నైజీరియా | 54.6 కోట్లు |
పాకిస్తాన్ | 48.7 కోట్లు |
కాంగో | 43.1 కోట్లు |
యూఎస్ఏ | 39.4 కోట్లు |
ఇథియోపియా | 32.3 కోట్లు |
ఇండోనేషియా | 29.7 కోట్లు |
టాంజానియా | 24.4 కోట్లు |
ఈజిప్ట్ | 20.5 కోట్లు |
బ్రెజిల్ | 18.5 కోట్లు |
ఫిలిప్పీన్స్ | 18.0 కోట్లు |
బంగ్లాదేశ్ | 17.7 కోట్లు |
నైగర్ | 16.6 కోట్లు |
సూడాన్ | 14.2 కోట్లు |
అంగోలా | 13.3 కోట్లు |
ఉగాండా | 13.2 కోట్లు |
మెక్సికో | 11.6 కోట్లు |
కెన్యా | 11.3 కోట్లు |
రష్యా | 11.2 కోట్లు |
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ | 11 కోట్లు |
మొజాంబిక్ | 10.6 కోట్లు |
వియత్నాం | 9.1 కోట్లు |
కామెరూన్, మాలి | 8.7 కోట్లు |
మడగాస్కర్, టర్కీ | 8.3 కోట్లు |
ఇరాన్ | 7.9 కోట్లు |
దక్షిణాఫ్రికా | 7.4 కోట్లు |
యెమెన్, జపాన్, యూకే, జర్మనీ | సుమారు 7 కోట్లు |
కెనడా, సౌదీ అరేబియా, అర్జెంటీనా | సుమారు 5 కోట్లు |
ఆస్ట్రేలియా, ఇటలీ | 3.5 కోట్లు |
స్పెయిన్, దక్షిణ కొరియా | 3.0 కోట్లు |