Johnny Master: జానీమాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.