Breakfast: మన ఫుడ్‌.. ప్రపంచమంతా అంటోంది ‘వెరీ గుడ్‌’!

Our food the whole world is saying Very good

  • భారత అల్పాహార వంటకాలకు విదేశాల్లో డిమాండ్
  • ముఖ్యంగా దక్షిణ భారత టిఫిన్లకు విదేశీయుల ఫిదా
  • భిన్నమైన రుచి, ఆరోగ్యానికి హానికరం కాకపోవడమే కారణం

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి ఆ దేశంలో భిన్న రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కూరగాయలైనా, మాంసమైనా, అల్పాహారమైనా... వారికంటూ బాగా నచ్చినవి కొన్ని ఉంటాయి. ప్రపంచమే గ్లోబల్‌ విలేజీగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో... వివిధ దేశాల ఆహారం మరెన్నో దేశాలకు విస్తరిస్తోంది. చాలా మంది ఆ రుచులను ఎంజాయ్‌ చేస్తున్నారు. నచ్చితే తరచూ అదే ఆహారం తింటున్నారు.

మంచూరియా వంటి చైనీస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌, ఇటలీకి చెందిన పిజ్జాలు, అమెరికాకు చెందిన బర్గర్లు... ఇలా ఎన్నో వెరైటీలను మనం తరచూ తింటూనే ఉన్నాం కూడా. అలానే మన దేశానికి చెందిన కొన్ని రకాల బ్రేక్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. భిన్నమైన రుచి, ఆరోగ్యానికి హానికలిగించే పదార్థాలు లేకపోవడమే దీనికి కారణం. మరి ఆ వంటకాలేవో తెలుసుకుందామా...

ఇడ్లీ- కొబ్బరి చట్నీ- సాంబార్‌... 
ఫ్యాట్స్‌ పెద్దగా లేకుండా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌ తో ఉదయం పూట మంచి శక్తిని అందించే ఆహారం ఇడ్లీ. నూనె వాడకపోవడం, ఆవిరిపై ఉడికించడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు. అందుకే అమెరికా, యూరప్‌ దేశాల్లో ఇడ్లీకి అభిమానులు పెరుగుతున్నారు.

ఆలూ పరాటా...
ఆలుగడ్డలను ఉడికించి, మసాలాలు కలిపి రోటీ మధ్య పెట్టి చేసే ఆలూ పరాటాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఉదయమే బ్రేక్‌ ఫాస్ట్‌ గా పెరుగుతోగానీ, పచ్చళ్లతోగానీ ఆలూ పరాటా తీసుకుంటున్నారు.

మసాలా దోశ 
క్రిస్పీగా, టేస్టీగా ఉండే మసాలా దోశ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫుడ్‌ లవర్స్‌ మనసు దోచుకుంటోంది. దోశతో ఇచ్చే ఆలూ మసాల కర్రీ, చట్నీల్లో వెరైటీలతో దుమ్ము లేపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత రెస్టారెంట్లు ఎక్కడున్నా... దోశ మాత్రం తప్పనిసరి.

పొంగల్‌, ఉప్మా
దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకునే పొంగల్‌, ఉప్మాలకు కూడా విదేశాల్లో ఆదరణ లభిస్తోంది. ఇందులోనూ వివిధ రకాల కూరగాయల ముక్కలు వేసి, చేస్తున్న ఉప్మాకు విదేశీయులు కూడా ఫిదా అవుతున్నారట.

పోహ...
అటుకులు, వేరుశనగలతో కూడిన పోహకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. పెద్దగా నూనె, మసాలాలు, కొవ్వు పదార్థాలు ఉండకపోవడంతో డైటింగ్‌ చేసేవారికి కూడా చాలా బెటర్‌.

పూరీ కర్రీ, ఛోలే భతురె 
మన దగ్గర ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని తేడా లేకుండా... అన్నిచోట్లా దొరికే పూరీ-కర్రీకి ఇతర దేశాల్లోనూ ఆదరణ లభిస్తోంది. విదేశాల్లోని భారత రెస్టారెంట్లు పూరీతో ఆలూ, ఛోలే వంటి వివిధ రకాల కర్రీలు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
కాబూలీ శనగలతో చేసే ప్రత్యేకమైన కర్రీతో ఇచ్చే ఛోలే భతురేకు కూడా అభిమానులు పెరుగుతున్నారు. 

థెప్లా..
గోధుమ పిండిలో మెంతి ఆకులు, మసాలాలు కలిపి చేసే ఒక రకం రోటీ ఇది. గుజరాతీల సంప్రదాయ బ్రేక్‌ ఫాస్ట్‌ అయిన థెప్లాకు విదేశాల్లో ఆదరణ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News