sc railway: అయ్యప్ప భక్తుల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్

sc railway to run special trains for ayyappa devotees
  • డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్లు 
  • విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు ప్రత్యేక రైళ్లు
  • విశాఖ – కొల్లం, శ్రీకాకుళం రోడ్ – కొల్లం, కాచిగూడ – కొట్టాయం,  హైదరాబాద్ – కొట్టాయం రూట్‌లలో ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప దీక్షా స్వాముల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మండల దీక్ష చేపట్టిన దీక్ష స్వాములు ఎక్కువ సంఖ్యలో రైళ్లలోనే శబరిమలకు వెళ్లి స్వామివారికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించడం జరుగుతోంది. ఏపీ, తెలంగాణ నుండి శబరిమలకు వెళ్లే భక్తులు ముందుగానే ట్రైన్ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవడంతో రెగ్యులర్ ట్రైన్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. 

దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో విశాఖపట్నం నుంచి కొల్లం ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందించనున్నాయి. 

విశాఖ - కొల్లం ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. కొల్లం - విశాఖ రైలు డిసెంబర్ 5 నుంచి ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7.35 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 

అలానే శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య 18 సర్వీసులు నడపనున్నారు. వీటిలో శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య డిసెంబర్ 1 నుంచి ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ..బుధవారం వేకువజాము 2.30 గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.  
 
ఇక, కాచిగూడ - కొట్టాయం మధ్య డిసెంబర్ 5 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడలో బయలుదేరి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. తిరుగు ప్రయాణానికి కొట్టాయం - కాచిగూడకు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) ప్రత్యేక రైలు రాత్రి 8.30 గంటలకు కొట్టాయంలో బయలుదేరి శనివారం రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోనుంది.

అలాగే హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలు డిసెంబర్ 3 నుండి జనవరి 1వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. అలాగే కొట్టాయం - హైదరాబాద్ ప్రత్యేక రైలు బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి గురువారం రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది. 
sc railway
special trains
ayyappa devotees
sabarimala

More Telugu News