Deep Depression: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.... దిశ మారింది!

Depression in Bay Of Bengal intensified into Deep Depression

  • బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం
  • రాగల 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం
  • దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. 

దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఏపీ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. 

నవంబరు 27, 28, 29 తేదీల్లో మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News