Nara Lokesh: పిల్లలకు అర్థమయ్యేలా భారత రాజ్యాంగాన్ని తీసుకురావాలి: నారా లోకేశ్

Nara Lokesh in Constitution day celebrations

  • ఏపీ సెక్రటేరియట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
  • హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు
  • రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలన్న లోకేశ్

భారత రాజ్యాంగాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... 1949 నవంబర్ 26న ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలని చెప్పారు. పిల్లలు, పెద్దలు అందరికీ అర్థమయ్యేలా రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పిల్లలే భారత భవిష్యత్తు అని చెప్పారు.

మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ... సర్వసత్తాక గణతంత్ర దేశంగా భారత్ ను ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమే అని అన్నారు. రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News