Jagga Reddy: ఉద్యమంలో బీఆర్ఎస్ ముందుండటం వల్లే 2014లో అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి

Jagga Reddy appreciation for brs

  • సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారన్న జగ్గారెడ్డి
  • ఉమ్మడి రాష్ట్రం ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండేవని వ్యాఖ్య
  • కేటీఆర్ వయస్సు ఎంత, ఆయన శక్తి ఎంత అని ఆగ్రహం

తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ముందుండటం వల్లే 2014, 2018లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రమే ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండి ఉండేవన్నారు. 

అలాంటి కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలిస్తామని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేటీఆర్ వయస్సు ఎంత? ఆయన శక్తి ఎంత? కాంగ్రెస్ మర్రిచెట్టు వేరు నుంచి వచ్చిన మొక్కే కేసీఆర్ అన్నారు. కేటీఆర్ తన వయస్సుకు మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యూహాల ముందు, కాంగ్రెస్ పార్టీ ముందు ఆయన వయస్సు, శక్తి ఎంత అన్నారు. కాంగ్రెస్ వయస్సు 140 సంవత్సరాలు అయితే కేటీఆర్ వయస్సు 53 కావొచ్చు అన్నారు.

మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ... బీజేపీకి రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చి అధికారంలోకి రావడమే వారికి కావాలని ఆరోపించారు.

2000 సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో మార్పులు తీసుకు రావడానికి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలుస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందన్నారు. 

  • Loading...

More Telugu News