Seethakka: కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: సీతక్క డిమాండ్

Seethakka demand for KTR apology

  • ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతిచ్చిందని వెల్లడి
  • ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌పై ఆగ్రహం
  • ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ ముఖ్య నేత కుటుంబానిదేనన్న సీతక్క

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు అబద్ధాలు చెబుతున్న కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అబద్ధాల పునాదుల మీద తిరిగి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు.

ఆమె మాట్లాడుతూ... ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ ముఖ్య నేత కుటుంబానికి చెందినదేనని ఆరోపించారు. అందుకే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కూడా గత బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలే అన్నారు. ఈ పరిశ్రమ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన కంపెనీలో బీఆర్ఎస్ ముఖ్యనేత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ దొంగనాటకాలు బంద్ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులిస్తే తమ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News