Vennela Kishore: వెన్నెల కిశోర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌' టీజ‌ర్ చూశారా..?

Vennela Kishore Srikakulam Sherlockholmes Movie Teaser Out Now
  • రైట‌ర్‌ మోహ‌న్ దర్శ‌క‌త్వంలో 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'
  • క‌థానాయిక‌గా అన‌న్య నాగ‌ళ్ల 
  • డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానున్న మూవీ
టాలీవుడ్‌ క‌మెడియ‌న్‌ వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘శ్రీ‌కాకుళం షెర్లాక్ హోమ్స్’. ‘చంటబ్బాయ్ తాలుకా’ అనేది ఉప‌శీర్షిక‌. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు. రైట‌ర్‌ మోహ‌న్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టించారు. 

శ్రీ‌కాకుళంలో జ‌రిగిన‌ ఓ హ‌త్య‌ కేసులో పోలీసుల‌కు కూడా అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల్ని ఓ లోక‌ల్ గూఢ‌చారి ఎలా ఛేదించాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. టీజ‌ర్‌లో ఎప్ప‌టిలానే వెన్నెల కిశోర్ త‌న‌దైన కామెడీ, డైలాగ్ డెలివ‌రీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. 

"అవుట్ లుక్ చూసి కాదు సార్‌.. అవుట్ పుట్ చూసి ఇవ్వండి. ఛాన్సిస్తేనే క‌దా చిరంజీవి మ్యాచో మెగాస్టార్ అయ్యారు", "ఈ క్రైమ్‌లో పాత్ర‌ధారి, సూత్ర‌ధారి, క‌ప‌ట‌ధారితో పాటు ఓ మాయ‌దారి కూడా ఉన్నాడు" అనే డైలాగులు టీజ‌ర్‌లో బాగున్నాయి. డిసెంబ‌ర్‌ 25న ఈ మూవీ విడుద‌ల కానుంది. 

Vennela Kishore
Srikakulam Sherlockholmes
Teaser
Tollywood

More Telugu News