Tejashwi Yadav: మోదీ బిర్యానీ కోసం పాక్ వెళ్లొచ్చు కానీ.. భారత జట్టు ఆడేందుకు వెళ్లకూడదా?: తేజస్వీయాదవ్

RJD leader Tejashwi Yadav Asked Team India What Is The Problem To Visit Pakistan For Champions Trophy

  • వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ
  • భారత జట్టును పాక్ కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయం
  • హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు పాక్ ససేమిరా
  • భారత జట్టు పాక్‌లో ఎందుకు పర్యటించకూడదన్న తేజస్వి

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు వెళ్లబోదన్న వార్తలపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ స్పందించారు. రాజకీయాలను, క్రీడలను కలిపి చూడడం సరికాదని హితవు పలికారు. పాకిస్థాన్ వెళ్లేందుకు ఆటగాళ్లకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. 

‘‘ క్రీడలను, రాజకీయాలను కలిపి చూడడం తగదు. మనం వెళ్లాలి, ఇతర జట్లు రావాలి. ఒలింపిక్స్‌లో ఎవరూ ఆడడం లేదా? భారత జట్టు అక్కడికి (పాక్) ఎందుకు వెళ్లకూడదు? అభ్యంతరమేంటి? ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తింటే ఓకే.. కానీ, భారత జట్టు వెళ్తే మాత్రం ఎందుకు మంచిది కాదు?’’ అని తేజస్వీయాదవ్ ప్రశ్నించారు.

చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం లేదన్న వార్తలపై తేజస్వి ఇలా స్పందించారు. మరోవైపు, హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్థాన్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.  

  • Loading...

More Telugu News