Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
- బంగాళాఖాతంలో 'ఫెంగల్' తుపాను
- గంటలకు 13 కిలోమీటర్ల వేగంతో పయనం
- ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ సంస్థ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆ సాయంత్రం తుపానుగా మారింది. ఈ తుపానుకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) 'ఫెంగల్' అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ తుపాను పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 13 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తోందని ఐఎండీ వెల్లడించింది.
దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.