ap assmbly: విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు

assembly forms committee to probe corruption at visakh dairy

  • ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు 
  • హౌస్ కమిటీ చైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ
  • కమిటీ సమగ్ర విచారణ జరిపి, రెండు నెలల లోపు నివేదికను సమర్పించాలన్న స్పీకర్ 

విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు. 

జ్యోతుల నెహ్రూ చైర్మన్‌గా, బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కే.కె. రంగారావు, దాట్ల సుబ్బరాజు సభ్యులుగా హౌస్ కమిటీని స్పీకర్ నియమించారు.

విశాఖ డైరీలో అవినీతి, అక్రమాలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి, రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇది ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News