Swiggy: కస్టమర్ పెట్టిన రిక్వెస్ట్ కు కదిలిపోయిన స్విగ్గీ సీఈవో... ఏకంగా ఫ్లాష్ సేల్ ఏర్పాటు

Delhi Mans Plea To Restaurant Invokes Flash Sale On Swiggy

  • ఉల్లిపాయలు కొనలేకపోతున్నా కొంచెం అదనంగా పంపించాలన్న కస్టమర్
  • బిర్యానీ ఆర్డర్ పెట్టి ఎక్స్ ట్రా ఆనియన్స్ కోసం రిక్వెస్ట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో... ఇన్ స్టామార్ట్ లో ఫ్లాష్ సేల్ పెట్టిన స్విగ్గీ సీఈవో

బిర్యానీతో పాటు నాలుగు ఉల్లిపాయ ముక్కలు అదనంగా పంపించాలంటూ ఓ కస్టమర్ చేసిన రిక్వెస్ట్ కు స్విగ్గీ సీఈవో కదిలిపోయాడు. ఉల్లిపాయల రేట్లు తగ్గించలేను కానీ నీలాంటి వారికోసం ఓ గంట పాటు తక్కువ ధరకే ఉల్లిపాయలు అమ్ముతానంటూ ఇన్ స్టా మార్ట్ లో ఫ్లాష్ సేల్ ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వివరాలు...

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. మార్కెట్ లో ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి, కొనలేక పోతున్నా ప్లీజ్ ఓ నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా పంపండి అంటూ ఆ రెస్టారెంట్ వాళ్లకు రిక్వెస్ట్ పెట్టాడు. ఆర్డర్ వచ్చాక బిల్లుపై ఈ రిక్వెస్ట్ చూసిన ఆ యువకుడి ఫ్లాట్ మేట్ సరదాగా దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. ఉల్లిపాయల రేట్లపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

ఈ ఫొటో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ దాకా చేరింది. దీంతో ఆయన స్పందిస్తూ... ఉల్లిపాయల రేట్లు తగ్గించలేం కానీ నీలాంటి వారి కోసం ఈ రోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు ఇన్ స్టా మార్ట్ లో ఫ్లాష్ సేల్ ఏర్పాటు చేస్తున్నామంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఇన్ స్టా మార్ట్ లో రూ.39 లకే కిలో ఉల్లిపాయలు కొనుగోలు చేసే ఆఫర్ ప్రకటించాడు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకు గంటపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, తమ దగ్గర స్టాక్ అయిపోయేలోపే ఆర్డర్ పెట్టుకోండని ఫణి కిషన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News