ACB: ఏఈఈ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ
- నార్సింగి పీఎస్ పరిధిలోని నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ
- నిఖేశ్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు
ఓ నీటి పారుదల శాఖ ఏఈఈ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీబీఈఎల్ సిటీ అపార్ట్‌మెంట్‌లోని నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిఖేశ్ కుమార్ ఇంటితో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనికి ఫాంహౌస్, వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేజీల కొద్ది బంగారం కూడా గుర్తించారు. ఇప్పటి వరకు అతని ఆస్తుల విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు.