Fengal Cyclone: తీరం దాటిన 'ఫెయింజల్' తుపాను
- నైరుతి బంగాళాఖాతంలో తుపాను
- శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన తుపాను
- నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఏపీ విపత్తు నివారణ సంస్థ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తీరాన్ని దాటింది. శనివారం రాత్రి గం. 10.30 నుంచి గం. 11.30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.