Rajamouli: ఇంట్రడక్షన్ సీన్ ఎక్స్ లెంట్: 'పుష్ప 2' ఈవెంటులో రాజమౌళి!

Pushpa 2 Event

  • హైదరాబాదులో 'పుష్ప 2' ఈవెంట్ 
  • భారీస్థాయిలో తరలివచ్చిన అభిమానులు
  • సందడిగా మారిపోయిన వాతావరణం 
  • 'పుష్ప 2' గురించి మాట్లాడవలసిన అవసరం లేదన్న రాజమౌళి   
     


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప 2' ఈ నెల 5వ తేదీన థియేటర్లకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా కోసం అభిమానులంతా ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును, 'పుష్పాస్ వైల్డ్ ఫైర్ జాతర' పేరుతో హైదరాబాదులోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. 

ఈ వేడుకకి హాజరైన రాజమౌళి మాట్లాడుతూ .. "సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్లినప్పుడు మనం చెప్పేది ఆ సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉండాలని అనుకుంటాము. కానీ ఈ సినిమా విషయంలో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం నేను ఒక పనిమీద  'రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినప్పుడు, అక్కడ 'పుష్ప 2' షూటింగు జరుగుతోంది.

సుకుమార్ - బన్నీ ఇద్దరితోను మాట్లాడాను.  'ఒక సీన్ చూస్తారా?' అని సుకుమార్ అడిగితే 'చూస్తాను' అన్నాను. అప్పుడు నాకు 'పుష్పరాజ్' ఇంట్రడక్షన్ సీన్ చూపించారు. ఆ సీన్ చూసిన తరువాత ఒకే ఒక మాట చెప్పాను. ఈ సీన్ కి దేవిశ్రీ ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత ఎక్స్ లెంట్ గా ఉంటుందని అన్నాను. నాకు తెలిసి 4 తేదీ రాత్రికే 'పుష్ప 2' సత్తా ఏమిటనేది ప్రపంచానికి అర్థమైపోతుంది" అని అన్నారు.

  • Loading...

More Telugu News