Pushpa: పుష్ప-2 టిక్కెట్ ధరలను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

Petition in High Court on Puspa film ticket rates

  • డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప-2 సినిమా
  • ప్రీమియర్ షో టికెట్ పై రూ.800 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి
  • రేపు విచారణకు రానున్న పిటిషన్

సినీ నటుడు అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించడం తెలిసిందే. ఈ సినిమా టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలంగాణలో ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ మధ్య రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది రేపు విచారణకు రానుంది.

కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనుసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. 

  • Loading...

More Telugu News