Devendra Fadnavis: ఏక్‌నాథ్ షిండేను కలిసేందుకు ఆయన ఇంటికెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్

Devendra Fadnavis meets Eknath Shinde

  • ఆపద్ధర్మ సీఎం నివాసం 'వర్ష'కు వచ్చిన ఫడ్నవీస్
  • ప్రమాణ స్వీకారానికి ముందు భేటీకి ప్రాధాన్యత
  • ఎల్లుండి ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వం

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే స్పష్టత రాలేదు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో షిండేతో ఫడ్నవీస్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏక్‌నాథ్ షిండేతో సమావేశం కోసం ఫడ్నవీస్ సాయంత్రం ఆపద్ధర్మ సీఎం నివాసం 'వర్ష'కు వచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై పది రోజులవుతోంది. మహాయుతి కూటమి అద్భుత విజయం దక్కించుకుంది. కానీ ముఖ్యమంత్రి పదవితో పాటు వివిధ కారణాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది. సీఎంగా ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పేరును అధికారికంగా ప్రకటించనప్పటికీ... ఎల్లుండి ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని మహాయుతి కూటమి ప్రకటించింది.

ఎన్నికల ఫలితాల తర్వాత మహాయుతి కూటమికి చెందిన ముగ్గురు కీలక నేతలు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. కానీ ఫడ్నవీస్, షిండే భేటీ కావడం ఇదే మొదటిసారి. మరోవైపు, బీజేపీ నేత, మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ గత ఇరవై నాలుగు గంటల్లో రెండుసార్లు షిండేను కలిశారు.

  • Loading...

More Telugu News