Pushpa: పుష్ప-2 సినిమా విడుదలను ఆపాలంటూ పిటిషన్... కొట్టివేసిన హైకోర్టు
- ఈ సినిమా స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉందని పిటిషన్
- రిట్ దాఖలు చేసిన సారారపు శ్రీశైలం
- ఊహాజనిత ఆరోపణల ఆధారంగా నిలిపివేయలేమన్న హైకోర్టు
- కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషన్‌కు జరిమానా విధించిన హైకోర్టు
పుష్ప-2 సినిమా విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని సారారపు శ్రీశైలం అనే అతను రిట్ దాఖలు చేశారు. ఈ సినిమా స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉందని అందులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్య కొట్టివేశారు. సెన్సార్ బోర్డ్ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. మార్పులు సూచించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
ఊహాజనిత ఆరోపణల ఆధారంగా సినిమా విడుదలను నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు సమయం వృథా చేసినందుకు గాను పిటిషనర్‌కు జరిమానా విధించింది. ఈ జరిమానాను అక్రమ రవాణాకు గురైన మహిళా బాధితులకు, పిల్లల సంక్షేమం కోసం పాటుపడే సంస్థలకు అందజేయాలని ఆదేశించింది.