Pushpa2: 'పుష్ప2' రిలీజ్‌కి ముందు ట్విస్ట్.. 3డీ వెర్షన్‌లో మూవీ విడుదలకు బ్రేక్!
- వరల్డ్‌వైడ్‌గా 12వేలకు పైగా స్క్రీన్స్‌లో 'పుష్ప2' రిలీజ్
- ప్రస్తుతం 3డీ వెర్షన్‌లో మూవీ విడుదలకు బ్రేక్
- ఈ వెర్షన్ తాలూకు పనులు ఇంకా పెండింగ్
- అందుకే ఈ నిర్ణయమంటూ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడి
- ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్‌లో మాత్రమే ప్రదర్శన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప2: ది రూల్' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను 12వేలకు పైగా స్క్రీన్స్‌లో వివిధ ఫార్మాట్లలో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. అయితే, ప్రస్తుతం 3డీ వెర్షన్‌లో మూవీ విడుదల కావడం లేదట.
3డీ వెర్షన్‌లోనూ మూవీని షూట్ చేసినప్పటికీ దీని తాలూకు ఎడిటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్‌ను మాత్రమే ప్రదర్శించనున్నారని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 3డీ వెర్షన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం.
కాగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మొత్తం ఏడు ఫార్మాట్లలో (2డీ, 3డీ, ఐమ్యాక్స్, డాల్బీ, 4డీఎక్స్, డీబాక్స్, ఐస్) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్ దాదాపు రెడీ అయింది. ఏవైనా చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఉంటే ఈ రోజు రాత్రిలోపు పూర్తి చేయాలని సుక్కు టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది.