ISRO: నేడు పీఎస్ఎల్వీ సీ59ని ప్రయోగించనున్న ఇస్రో

ISRO to launch PSLV C59 today

  • సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం
  • రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్న ఇస్రో
  • నిన్న మధ్యాహ్నం 2.38 గంటల నుంచి కొనసాగుతున్న కౌంట్ డౌన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమయింది. ఈ సాయంత్రం 4.08 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ59ని ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను నిర్ధారిత కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. 

షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై అనుసంధానం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా అక్యుల్టర్, కరోనా గ్రాస్ అనే రెండు శాటిలైట్లను నింగిలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ నిన్న మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమయింది. 

మరోవైపు, ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారి సుప్రభాతసేవలో ఇస్రో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News