Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత పెళ్లికి హాజరవుతున్న గెస్టులు వీరే

Guests attending Naga Chaitanya and Sobhita marriage

  • ఈ రాత్రి 8.13 గంటలకు చైతూ, శోభిత వివాహం
  • పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్
  • పెళ్లికి హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం ఈ రాత్రి 8.13 గంటలకు జరగనుంది. పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇరు కుటుంబాలతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నారు. మెగా, నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకదిగ్గజం, రాజమౌళి వివాహ వేడుకకు రానున్నారు. అల్లు అర్జున్ కూడా కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నట్టు సమాచారం. రాజకీయ, సీనీ రంగాలకు చెందిన కీలక వ్యక్తులు పెళ్లికి హాజరుకానున్నారు. వివాహం పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది.

  • Loading...

More Telugu News