Puspha2: ‘పుష్ప2’ సినిమా ఎలా ఉందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

Director Ram Gopal Varma says  ALLU is MEGA MEGA MEGA MEGA MEGA and he reacted on Puspha2
  • పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ అన్న వర్మ 
  • అల్లు అర్జున్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఆర్జీవీ 
  • అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా అంటూ వ్యాఖ్య
యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప2‘ సినిమా సందడి మొదలైంది. ఇవాళ (గురువారం) ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12 వేలకుపైగా స్క్రీన్లపై ఈ మూవీ విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ ఎక్కడా వినిపించడం లేదు. అల్లు అర్జున్ నటన అద్భుతానికి మించిపోయిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూవీ చూసిన వారు చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయారు.

పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ సాధించిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ‘‘అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా’’ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 

అంతకుముందు 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్టులోనూ హీరో అల్లు అర్జున్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని కితాబునిచ్చాడు.
Puspha2
Allu Arjun
Ram Gopal Varma
Movie News
Tollywood

More Telugu News