Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ పేరిట అవాంఛిత రికార్డు.. ఇలా ఔట్ కావడం తొలిసారి

Yashasvi Jaiswal has registered a golden duck first time in his Test career
  • అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌‌లో ఆరంభ బంతికే యువ బ్యాటర్ ఔట్
  • టెస్ట్ కెరీర్‌లో గోల్డెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి
  • సునీల్ గవాస్కర్, కేఎల్ రాహుల్ సరసన చేరిన యశస్వి జైస్వాల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం రెండవ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ ఆరంభంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ తొలి బంతికే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ సంధించిన బంతికి ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్టార్క్ ఫుల్ డెలివరీ వేయగా మిడ్ వికెట్ వైపు ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించిన జైస్వాల్ బ్యాలెన్స్‌ కోల్పోయి బంతిని మిస్సయ్యాడు. దీంతో బాల్ దూసుకెళ్లి ప్యాడ్స్‌ను తాకింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీ ఏమాత్రం సందేహించకుండా చూపుడు వేలు గాల్లోకి లేపాడు. దీంతో జైస్వాల్ నిరుత్సాహంతో పెవిలియన్ బాట పట్టాడు.

ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడంతో యశస్వి జైస్వాల్ పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. జైస్వాల్ తన టెస్టు కెరీర్‌లో గోల్డెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో టెస్టు క్రికెట్‌లో గోల్డెన్ డకౌట్ అయిన మరో ఆరుగురు భారత క్రికెటర్ల జాబితాలో ఈ యువ ఆటగాడు చేరాడు. జైస్వాల్ కంటే ముందు సునీల్ గవాస్కర్, సుధీర్ నాయక్, డబ్ల్యూవీ రామన్, శివ సుందర్ దాస్, వసీం జాఫర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.
Yashasvi Jaiswal
Sports News
Cricket
India Vs Australia

More Telugu News