TGSRTC: విజయవాడ, విశాఖ సహా దూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్
- హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు
- విడతలవారీగా అందుబాటులోకి పికప్ వ్యాన్ సేవలు
- తొలి విడతలో ఈసీఐఎల్-ఎల్బీనగర్ మధ్య అందుబాటులోకి సేవలు
దూర ప్రయాణం చేసేవారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈరోజు నుంచి రాజధాని జంట నగరాల్లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. దశలవారీగా నగరమంతా ఈ పికప్ వ్యాన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో ఈసీఐఎల్-ఎల్బీనగర్ మధ్య ఉన్న ప్రాంతాల్లో పికప్ వ్యాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్ వ్యాన్‌లను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్, హెచ్ఎంటీ నగర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్డు, నాగోల్, సుప్రజ ఆసుపత్రి, ఎల్బీ నగర్ ఎల్‌పీటీ మార్కెట్ నుంచి పికప్ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి.