Yadadri Bhuvanagiri District: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!
- యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు
- కారు చెరువులో మునగడంతో ఐదుగురు యువకుల మృతి
- మృతులు హైదరాబాద్కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీగా గుర్తింపు
- హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా దుర్ఘటన
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులో మునగడంతో అందులో ఉన్న ఆరుగురు యువకుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు చెరువులోంచి సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీగా పోలీసులు గుర్తించారు.