Siraj: హెడ్ చెప్పిందంతా అబద్ధం... సిరాజ్ వివరణ వీడియో

Siraj Reaction On Travis Heads Send Off Controversy

  • వెల్ బౌల్డ్ అంటూ మెచ్చుకున్నానని హెడ్ వ్యాఖ్య
  • హెడ్ తనను దూషించాడని సిరాజ్ ఆరోపణ
  • ఆడిలైడ్ టెస్ట్ లో సిరాజ్- హెడ్ మధ్య గొడవ

ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ట్రావిస్ ను బౌల్డ్ చేసిన తర్వాత సిరాజ్ సంబరాలు చేసుకుంటుండగా పెవిలియన్ వైపు వెళుతూ హెడ్ కామెంట్ చేయడం వీడియోలో కనిపించింది. అయితే, తాను సిరాజ్ ను మెచ్చుకున్నానని, వెల్ బౌల్డ్ అని అన్నానని హెడ్ చెప్పాడు. దీనిపై తాజాగా మహ్మద్ సిరాజ్ స్పందించాడు. హర్భజన్ సింగ్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెవిలియన్ వైపు వెళుతూ హెడ్ తనను దూషించాడని చెప్పాడు. 

హెడ్ మంచి బ్యాటర్ అని, అతడికి బౌలింగ్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తానని సిరాజ్ చెప్పాడు. అయితే, మైదానంలో జరిగిన సంఘటనపై హెడ్ అబద్ధం చెబుతున్నాడని ఆరోపించాడు. హెడ్ సిక్సర్ బాదిన తర్వాతి బంతికే బౌల్డ్ చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని వివరించాడు. ఆ సంతోషంతో తానుంటే హెడ్ తనను తిడుతూ వెళ్లిపోవడం ఆగ్రహం తెప్పించిందని అన్నాడు. అయినప్పటికీ ఆ సమయంలో తానేమీ మాట్లాడలేదని, వీడియోలో చూస్తే తెలిస్తుందని అన్నాడు. క్రికెట్ జెంటిల్‌మన్ గేమ్ కానీ, హెడ్ ప్రవర్తించిన తీరు మాత్రం తప్పేనని సిరాజ్‌ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News