Telangana Thalli: ప్రొఫైల్ పిక్ మార్చిన బీఆర్ఎస్ పార్టీ... కానీ...!

BRS Party changed its profile pic with Telangana Thalli idol

  • డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
  • తాజాగా తెలంగాణ తల్లి బొమ్మను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ పిక్ లో తెలంగాణ తల్లికి కిరీటం
  • కాంగ్రెస్ సర్కారు బొమ్మలో కిరీటం లేకుండా తెలంగాణ తల్లి

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం ఫొటోను ఇటీవల విడుదల చేశారు. ఆ విగ్రహం కాస్త భిన్నంగా ఉండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తన ప్రొఫైల్ పిక్ ను మార్చింది. తెలంగాణ తల్లి విగ్రహం బొమ్మను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంది. 

అయితే, ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి బొమ్మకు, బీఆర్ఎస్ ప్రొఫైల్ పిక్ లోని తెలంగాణ తల్లి బొమ్మకు తేడా ఉంది. కాంగ్రెస్ బొమ్మలో విగ్రహానికి కిరీటం లేదు, బీఆర్ఎస్ బొమ్మలో తెలంగాణ తల్లికి కిరీటం ఉంది. అంతేకాదు, ముఖం కూడా మార్పు ఉంది.

  • Loading...

More Telugu News