Ponnam Prabhakar: ఆ చార్జిషీట్ ను రిప్రజెంటేషన్ గా భావిస్తున్నాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar counters Harish Rao Chargesheet

  • తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి
  • విమర్శిస్తూ చార్జిషీట్ విడుదల చేసిన హరీశ్ రావు
  • ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శిస్తున్నారన్న పొన్నం
  • చార్జిషీట్ లో ప్రజా అంశాలుంటే పరిశీలిస్తామని వెల్లడి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనను విమర్శిస్తూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చార్జిషీట్ విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే తమను విమర్శిస్తున్నారని, ఇప్పుడు ఏడాది పూర్తి కాగానే చార్జిషీట్ అంటున్నారని మండిపడ్డారు. 

అయితే, ఈ చార్జిషీట్ ను విపక్షాలు తమకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావిస్తామని అన్నారు. అందులోని అంశాలు ప్రజలకు సంబంధించినవి అయితే వాటిని పరిశీలిస్తామని తెలిపారు. 

బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఒక్కటే అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో....  ప్రభుత్వం ఎలా నడుస్తుంది? అంటూ పిల్లి శాపనార్థాలు పెట్టారని వెల్లడించారు. ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారని, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News