weight loss: జీరా వాటర్​, ధనియా వాటర్​... బరువు తగ్గేందుకు ఏది బెస్ట్​?

jeera water or coriander seeds water which is better for weight loss

  • మారిన జీవన శైలితో అధిక బరువు సమస్య
  • రోజురోజుకు పెరిగిపోతున్న ఊబకాయుల సంఖ్య
  • కొన్ని చిన్న జాగ్రత్తలతో బరువు తగ్గవచ్చని సూచిస్తున్న నిపుణులు

ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుండటం... శరీరానికి వ్యాయామం లేకపోవడం... దీనితో బరువు పెరిగిపోవడం... చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. బరువు తగ్గేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. డైటింగ్ నుంచి వ్యాయామాల దాకా ఎన్నో చేస్తుంటారు. అయితే... బరువు తగ్గేందుకు తోడ్పడే వాటిలో జీరా (జీలకర్ర), ధనియాలు రెండూ కూడా ముఖ్యమైనవే. మరి ఈ రెండింటిలో దేనితో కూడిన నీళ్లు తాగితే ఎక్కువ ప్రయోజనమో, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా...

జీరా వాటర్‌...
వంటల్లో వాడే జీలకర్ర (జీరా) మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్‌, విటమిన్ సీ తోపాటు యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వైరల్‌ ఇన్ఫెక‌్షన్లపై పోరాటంలో జీరా మన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుందని చెబుతున్నారు.

ధనియా (కొరియాండర్‌ సీడ్స్‌) వాటర్‌...
ధనియాలు మన శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ధనియాలు నానబెట్టి, లేదా మరగబెట్టి చల్లార్చిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.

రెండింటిలో ఏది బెటర్‌?
జీరా వాటర్‌, ధనియా వాటర్‌ రెండూ కూడా శరీరం నుంచి విష పదార్థాలు, వ్యర్థాలను బయటికి పంపేందుకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. జీరా, ధనియా రెండూ కూడా బరువు తగ్గేందుకు తోడ్పడినా... వాటి విధానంలో కాస్త భేదం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. రెండింటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో కొవ్వును కరిగిస్తాయని వివరిస్తున్నారు.
  • శరీరంలో జీవక్రియలు (మెటబాలిజం) సమర్థవంతంగా పనిచేయడానికి... ఆహారం సులువుగా జీర్ణం కావడానికి జీరా వాటర్‌ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరంలో మెటబాలిజం పెంచుకోవాలంటే ఇది మేలు అని సూచిస్తున్నారు.
  • ఇక ధనియా వాటర్‌ లో ఫైబర్‌ శాతం చాలా ఎక్కువ. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతకు తోడ్పడి, బరువు తగ్గేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. కొవ్వు పదార్థాలను శరీరం సంగ్రహించకుండా అడ్డుకుంటుందని.. మాంసాహారులకు ఇది బాగా ప్రయోజనకరమని వివరిస్తున్నారు.
  • ఈ రెండింటిలో మీ అవసరాన్ని, ఆహార అలవాట్లను బట్టి ఎంచుకుంటే బరువు తగ్గేందుకు తోడ్పడుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News