Pushpa 2: 'పుష్ప 2- ది రూల్' మూవీ మండే టాక్!

Pushpa 2 Upadate

  • భారీ వసూళ్లతో దూసుకుపోతున్న 'పుష్ప 2'
  • అనవసర విషయాలను హైలైట్ చేశారనే టాక్ 
  • క్లైమాక్స్ కి ముందు కథ బలహీన పడిందంటున్న ఆడియన్స్
  • బలమైన విలనిజం లేకపోవడం పట్ల అసంతృప్తి  
           
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప 2' భారీ అంచనాల మధ్య ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, తొలిరోజు నుంచే రికార్డుల వేటను మొదలుపెట్టింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. భారీ యాక్షన్ దృశ్యాలు... బన్నీ మాస్ స్టెప్పులు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

అయితే కథాకథనాల పరంగా కొన్ని విమర్శలైతే అటు థియేటర్ల దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి... ఇటు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి! 'పుష్ప'లో కనిపించిన మేజిక్ ఈ సినిమాలో మిస్సయిందని అంటున్నారు. 'పుష్ప'లో కథ ఎర్రచందనం చుట్టూనే తిరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఇతర అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించారని అంటున్నారు. అంతగా ప్రాధాన్యతలేని అంశాలను హైలైట్ చేయడం వలన, క్లైమాక్స్ కి ముందు కథ బలహీన పడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఒక వైపున అధికార హోదాలో ఉన్న జగపతిబాబు... రావు రమేశ్, మరో వైపున అవమానంతో రగిలిపోతున్న పోలీస్ ఆఫీసర్ గా ఫహద్... ఇంకో వైపున పాత పగతో ఉన్న సునీల్ - అనసూయ... వీళ్లందరిలో ఎవరి పాత్ర కూడా పవర్ఫుల్ గా డిజైన్ చేయలేదు. హీరో ఎవరితో తలపడితే ఏమౌతుందో అనే ఒక టెన్షన్ ఆడియన్స్ కి కలిగించకపోవడం ఒక మైనస్ గా చెబుతున్నారు. పుష్పరాజ్ తో పాటు ఆయన చుట్టూ ఉండే ప్రధానమైన పాత్రలను కూడా బలంగా డిజైన్ చేసుంటే, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదనే టాక్ వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News