Supreme Court: ఇంకా 'ఉచితాలు' ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

For how long freebies can be given asks Supreme Court

  • కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్ మీద విచారణ
  • 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు తెలిపిన కేంద్రం
  • ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్న

"ఉచితాలు ఇంకెంత కాలం?" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇది విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలి ఉన్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవశ్యతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.

  • Loading...

More Telugu News