Konidela Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.... చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu decides to induct Nagababu into state cabinet
  • రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకు చోటిచ్చిన చంద్రబాబు
  • అధికారికంగా ప్రకటన విడుదల
  • దాంతో నాలుగుకు పెరిగిన జనసేన మంత్రుల సంఖ్య
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ చాన్స్ ఇస్తారంటూ జరిగిన ప్రచారానికి నేటితో తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పాతికమంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి నాలుగో మంత్రిగా నాగబాబు క్యాబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
Konidela Nagababu
Minister
Cabinet
Chandrababu
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News