Police Case: మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం.. కేసులు నమోదు చేసిన పోలీసులు!

Police Cases Registered against Manchu Manoj and Mohan Babu

  • నెట్టింట చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం
  • ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న మోహ‌న్‌బాబు , మ‌నోజ్ 
  • వారి ఫిర్యాదుల‌పై మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు

మంచు ఫ్యామిలీ వివాదం ప్ర‌స్తుతం నెట్టింట‌ తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఈ విదాదంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. 

మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో మ‌నోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మోహ‌న్‌బాబుకు చెందిన 10 మంది అనుచ‌రుల‌పై కేసు నమోదు చేశారు. 

అలాగే మోహ‌న్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మ‌నోజ్‌తో పాటు అత‌ని భార్య భూమా మౌనిక‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ వివాదంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News