Manchu Manoj: తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన మంచు మనోజ్
- భార్య మౌనికతో కలిసి డీజీ కార్యాలయానికి మనోజ్
- తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను వివరించిన మనోజ్
- తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
సినీ నటుడు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తనకు, తన భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మంచు మనోజ్, మౌనిక కారులో వచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత మంచు మనోజ్ తెలంగాణ డీజీపీ జితేందర్ ని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి.
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం, పరస్పర పోలీస్ ఫిర్యాదులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మొదట వీరిద్దరు పరస్పర ఆరోపణలతో లేఖలు విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నిన్న మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, మనోజ్, అతని భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.