qs rankings: క్యూఎస్ ర్యాంకుల్లో సత్తా చాటిన భారత విద్యాసంస్థలు

iit delhi leads indian varsities in sustainability in qs rankings
  • క్యూఎస్ ర్యాంకులు - 2025 విడుదల
  • 78 భారత వర్శిటీలకు క్యూఎస్ ర్యాంకింగ్‌ జాబితాలో చోటు
  • అగ్రస్థానంలో నిలిచిన యూనివర్శిటీ ఆఫ్ టొరంటో 
ఈ ఏడాది భారతీయ యూనివర్శిటీలు మెరుగైన క్యూఎస్ ర్యాంకులతో సత్తా చాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలకు వివిధ అంశాలవారీగా అంచనా వేసే క్యూఎస్ ర్యాంకులు – 2025 విడుదలయ్యాయి. సస్టయినబిలిటీ అంశంలో ఐఐటీ - ఢిల్లీ క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో 255 నుంచి 171కి ఎగబాకి ప్రత్యేకతను చాటుకుంది. 

భారత్ నుంచి మొత్తంగా 78 వర్శిటీలు ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. వీటిలో మన దేశం నుంచి టాప్ పది సంస్థలలో తొమ్మిది విద్యాసంస్థలు తమ స్థానాలను మెరుగుపర్చుకోగా, కొత్తగా 21 సంస్థలు ఈ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాలు, ప్రాంతాల నుంచి 1,740 వర్శిటీలకు ఈ జాబితాలో ర్యాంకింగ్స్ కేటాయించగా, ప్రపంచంలోనే అగ్రస్థానంలో యూనివర్శిటీ ఆఫ్ టొరంటో నిలిచింది. ఈటీహెచ్ జ్యూరిచ్ రెండో స్థానంలో, స్వీడన్ లోని లండ్ వర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీ మూడో స్థానంలో నిలిచాయి.
 
పర్యావరణ ప్రభావానికి సంబంధించి ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో నిలవగా, పర్యావరణ విద్యలో ప్రపంచంలోనే టాప్ - 50లో ఒకటిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు సత్తా చాటింది. 

భారతీయ వర్శిటీలు మెరుగైన ర్యాంకులు సాధించడంపై లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ ఉపాధ్యక్షుడు బెన్ సోటర్ మాట్లాడుతూ.. భారత్‌లోని వర్శిటీలు స్థిరమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయని చెప్పడానికి ఈ ర్యాంకింగ్సే నిదర్శనమని అన్నారు.    
qs rankings
iit delhi
varsities

More Telugu News