Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

Allu Arjun files petition in High Court

  • తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు
  • అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఈ కేసును కొట్టి వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన స్టైలిష్ స్టార్

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ఈ కేసును కొట్టివేయాలని కోరారు.

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్న సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు, సంధ్య థియేటర్ యజమాని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News