Kapil Dev: ఒక్క పర్ఫామెన్స్ తో ఆయనే కరెక్ట్ అని ఎలా చెప్పగలం?: కపిల్ దేవ్

How can we judge him with one performance asks Kapil Dev
  • రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • బుమ్రాను టెస్ట్ కెప్టెన్ చేయాలని పలువురి డిమాండ్
  • కెప్టెన్సీ మార్పు గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుందన్న కపిల్
2024 టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదీ కలిసి రావడం లేదు. శ్రీలంకతో వన్డే సిరీస్ ను కోల్పోవడం, న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ను ఓడిపోవడంతో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఫామ్ పరంగా కూడా రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. తన భార్య డెలివరీ కారణంగా తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు. రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. ఈ టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోహిత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. బుమ్రాను కెప్టెన్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ అంశంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కెప్టెన్ గా రోహిత్ వారసుడి గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని కపిల్ చెప్పారు. ఒక్క పర్ఫామెన్స్ తో నాయకత్వానికి ఆయనే కరెక్ట్ అని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. కెప్టెన్ గా ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు కెప్టెన్ గురించి ఎవరూ మాట్లాడరని... కష్టసమయాల్లో ఉన్నప్పుడు మాత్రమే జడ్జ్ చేస్తుంటారని అన్నారు. 
 
Kapil Dev
Rohit Sharma
bumrah

More Telugu News